News

గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

30views

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.

పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.