News

రేపటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

28views

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈరోజు టీటీడీ ఈఓ పాత్రికేయులతో మాట్లాడుతూతొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు,రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తామన్నారు. పెద్దశేష వాహనం రేపు రాత్రి 9 గంటలకు , ఈనెల 8వతేదీన గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు టీటీడీ ఈఓ వివరించారు. ఈరోజు రాత్రి అంకురార్పణ, రేపు సాయంత్రం ధ్వజారహణం, రేపు రాత్రి పెద్దశేష వాహనం, 5వతేదీ ఉదయం చిన్న శేష వాహనం, రాత్రికి హంస వాహనం, ఆరవ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనం, ఏడో తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, 8వ తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రికి గరుడ వాహనం, 9వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రికి గజ వాహనం, పదవ తేదీ ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రికి చంద్ర ప్రభాహనం, 11వ తేదీ ఉదయం స్వామివారి రథోత్సవం, రాత్రికి అత్వవాహనం, 11వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రికి బంగారు తిరుచ్చి ఉత్సవం..అదే రోజు ధ్వజా అవరోహణం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ తెలియజేశారు.బ్రహ్మోత్సవాల సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు,ఆర్జిత సేవలు,ప్రత్యేక దర్శనాలు రద్దు చేసామని..7 లక్షల లడ్డులు నిల్వగా వుంచడంతో పాటు లడ్డు పంపిణి కోసం అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
1200మంది టిటిడి విజిలెన్స్ సిబ్బందితో పాటు 3900 మంది పోలీసులతో భధ్రతా ఏర్పాట్లు చేశామన్నారు.తిరుమలలో 7 ప్రాంతాలలో 4 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం తిరుపతిలో 6 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు.