News

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ

30views

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పది రోజులపాటు కనకదుర్గా అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా ఉత్సవాల్లో తొలిరోజైనా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైన‌ద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోనే ముఖ్యమైంది. అందుకే విద్యోపాసకులకి మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీబాలాత్రిపురసుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణవలం అందించే అలంకారంలో శ్రీబాలా త్రిపుర సుందరీ దేవి దర్శనమిస్తారు.