News

విజయవాడలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

23views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడు నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే, విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయని పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు.

● హైదరాబాద్‌–చెన్నై మార్గంలో వెళ్లే భారీ వాహనాలు నార్కెట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లే లైట్‌ మోటారు వెహికల్స్‌ను ఇబ్రహీంపట్నం రింగ్‌, గొల్లపూడి వై జంక్షన్‌, స్వాతి జంక్షన్‌, కనకదుర్గ ఫ్లైఓవర్‌, పీఎన్‌బీఎస్‌ గేటు, కృష్ణలంక జాతీయ రహదారి, వారధి జంక్షన్‌, కనకదుర్గ వారధి, తాడేపల్లి వైపు పంపుతారు.

● చెన్నై–హైదరాబాద్‌ మార్గంలో వెళ్లే భారీ వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తారు. లైట్‌ మోటారు వెహికల్స్‌ను గుంటూరు, తాడేపల్లి, కనకదుర్గ వారధి, కృష్ణలంక జాతీయ రహదారి, కనకదుర్గ ఫ్లైఓవర్‌, స్వాతి జంక్షన్‌, గొల్లపూడి వై జంక్షన్‌, ఇబ్రహీంపట్నం రింగ్‌ మీదుకు పంపుతారు.

● హైదరాబాద్‌–విశాఖపట్నం మార్గంలో భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం రింగ్‌, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌, ఏలూరు మీదుగా పంపుతారు.

● విశాఖపట్నం–హైదరాబాద్‌ మార్గంలో వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం రింగ్‌ మీదు మళ్లిస్తారు.

● విశాఖపట్నం–చెన్నై మార్గంలో వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారధి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు వైపు పంపుతారు. లైట్‌ మోటారు వెహికల్స్‌ను గన్నవరం, నిడమానూరు, రామవరప్పాడు రింగ్‌, మహానాడు జంక్షన్‌, బెంజ్‌సర్కిల్‌ పాత ఫ్లైఓవర్‌, వారధి, తాడేపల్లి మీదుగా మళ్లిస్తారు.

● చెన్నై–విశాఖపట్నం మార్గంలో వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, పెనమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌, ఏలూరు మీదుగా పంపుతారు. లైట్‌ వెహికల్స్‌ను కనకదుర్గ వారధి, స్కూబ్రిడ్జి, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైవోర్‌, మహానాడు జంక్షన్‌, రామవరప్పాడు రింగ్‌ వైపు పంపుతారు.

● గుంటూరు–విశాఖపట్నం మార్గంలో వెళ్లే భారీ వాహనాలను గుంటూరు, బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్‌, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌ మీదుగా మళ్లిస్తారు. లైట్‌ వెహికల్స్‌ను వారధి, బెంజ్‌ సర్కిల్‌, రామవరప్పాడు రింగ్‌, వైపు పంపుతారు.

● విశాఖపట్నం–గుంటూరు వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారధి, వెల్లటూరు, కొల్లూరు, వేమూరు, తెనాలి, బుడంపాడు, గుంటూరు మీదుగా మళ్లిస్తారు. లైట్‌ మోటారు వెహికల్స్‌ను గన్నవరం, ఎనికేపాడు, రామవరప్పాడు రింగ్‌, మహానాడు జంక్షన్‌, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌, వారధి, మంగళగిరి వైపు పంపుతారు.