News

భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత

15views

పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి. చాలా పాశ్చాత్య దేశాలలో అవి మగ్గిపోతున్నాయి. భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన దేశంగా అమెరికా 297 పురాతన కళాఖండాలను భారత్ కు అప్పగించింది. ఇవన్నీ భారతదేశంలో దొంగిలించి అంతర్జాతీయ విపణిలో విక్రయించినవే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వీటిని అప్పగించారు. సెప్టెంబర్ 22న ఇందుకు కృతజ్ఞత తెలియచేస్తూ మోదీ, అధ్యక్షుడు బైడెన్ కు శతధా ధన్యవాదాలని ఎక్స్ వేదికగా తెలియచేశారు. ప్రస్తుతం భారత్ కు చేరుకుంటున్న పురాతన కళాఖండాలలో సాధారణ శకం 2000 సంవత్సరం మొదలు, సాధారణ శకం 1900 సంవత్సరం మధ్య కాలానికి చెందినవి ఉన్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరించే వస్తువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ఒప్పందం ఇరు దేశాలు ఈ జూలైలో చేసుకున్నాయి. ప్రస్తుతం 297 కళాఖండాలను అప్పగించారు. బైడెన్ తో వాషింగ్టన్ జరిగిన సమావేశం మధ్యలో బైడెన్ లాంఛనంగా కొన్నింటిని అప్పగించారు.