News

క్రైస్తవంలోకి మారిన వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసిన ప్రభుత్వం

47views

క్రైస్తవ మతంలోకి మారిన టి. లక్ష్మణరావు, అతని కుటుంబానికి జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేముల పాలెం గ్రామంలో జరిగింది. అక్రమంగా నిర్మిస్తున్న చర్చి విషయంలో పిటిషన్ దాఖలైంది. సుదీర్ఘ పోరాటం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.లక్ష్మణరావు కుటుంబం మత మార్పిడి వ్యతిరేకంగా గ్రామస్తులు తీవ్ర ఆందోళన చేశారు. దీని వల్ల ఈ ప్రాంతంలో సామాజిక మరియు మతపరమైన సమస్య తలెత్తింది.


అలాగే అక్రమ చర్చి నిర్మాణ విషయంలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిజానికి ఈ అక్రమ నిర్మాణం విషయంలో దత్తం శ్రీనివాసులు ఇతరులు 2021 లోనే ఫిర్యాదు చేశారు. అయినా లాభం లేకపోయింది. అలాగే ఎస్సీ సర్టిఫికేట్ రద్దు విషయంలోనూ గ్రామస్థులందరూ ఏకమై, పోరాటం చేశారు. అలాగే అక్రమ మతమార్పిడికి వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో క్రైస్తవంలోకి మారి, ఎస్సీ హోదాను పొందుతున్న మొత్తం కుటుంబ సభ్యుల కుల ధ్రువీకరణ పత్రాలు రద్దయ్యాయి.

Source : organiser.org