News

దాండియా ద్వారా మన సంస్కృతిని వ్యాప్తి చేయండి : భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్

26views

భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయం, తత్వశాస్త్రాల గొప్ప విలువలను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. కేవలం అదిమాత్రమేకాకుండా.. దేశంలో నైతిక విలువలు పెంపొందించడానికి, దేశంపట్ల అంకితభావం కోసం కూడా ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది.

దసరా నవరాత్రులు అనేవి భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక..ఇవి భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడానికి పునాదిలాంటివని చెప్పవచ్చు. అందుకని భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని అందరికీ తెలియపరిచేలా చేయాలని గార్బా/దాండియా ఈవెంట్ నిర్వాహకులకు ఫౌండేషన్ విజ్ఞప్తి చేస్తోంది.

నవరాత్రి పండుగను హిందువులు దుర్గాదేవిని ఆరాధిస్తూ జరుపుకుంటారు, తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో దుర్గాష్టమి అత్యంత పవిత్రమైన రోజు.. సాంప్రదాయకంగా, ఈ పండుగను హిందూ గృహాలలో 10 రోజుల పాటు జరుపుకుంటారు..ఈ నవరాత్రులు కూడా నియమనిష్టలతో ఉపవాసం చేస్తూ పవిత్రంగా ఉంటారు. జానపద నృత్యం గర్బా/దాండియా ఆడుతూ… సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకుంటారు.

సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ఆ సంప్రదాయం, సంస్కృతి కొనసాగుతోంది. హిందువుల మధ్య ఐక్యతను పెంపొందించడమే ఈ పండుగ అంతరార్థం, సంప్రదాయం, సంస్కృతికి విఘాతం కలిగిస్తే సనాతన ధర్మం విధ్వంసానికి దారి తీస్తుంది కాబట్టి, అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుకోవడం, సంరక్షించడం అనేది భవిష్యత్తు తరాలుగా ఇది మన నైతిక బాధ్యత.

కేవలం హిందూ సనాతన ధర్మాన్ని విశ్వసించేవారికి ప్రవేశం కల్పించడం ద్వారా హిందూ సంప్రదాయం, సంస్కృతిని ఖచ్చితంగా అనుసరించాలని ఫౌండేషన్ గర్బా/దాండియా (నృత్యం) ఈవెంట్ల నిర్వాహకులను అభ్యర్థిస్తోంది ట్రస్ట్.

హిందూ సనాతన ధర్మాన్ని నమ్మని కొందరు వ్యక్తులు గుప్తంగా ఉద్దేశ పూర్వకంగానే ఈ దాండియా వేడుకల్లోకి ప్రవేశించి పండుగ వాతావరణంతో పాటుగా, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే దురుద్దేశంతో కావాలని చెడగొట్టడానికి ప్రయత్నించడం ఇటీవలి కాలంలో గమనించవచ్చు. కాబట్టి ఈవెంట్ నిర్వాహకులు ముందస్తుగా అన్యమతస్తులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భావి తరానికి సనాతన ధర్మం విలువలు , సంస్కృతిని అందించడం అనేది మన ప్రస్తుత తరం నైతిక బాధ్యత, తద్వారా అవిశ్వాసుల అజెండా ఓడిపోతుంది. కాబట్టి నిర్వాకులు ఈ విషయాలన్నీ దఈష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ట్రస్ట్ అభ్యర్థిస్తోంది.