News

చైనాలో తినేవాటికి భారత్‌లో పూజలంటూ సనాతనధర్మంపై సీపీఎం అవహేళన

39views

హిందువులపై, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సీపీఎం నేత కేపీ ఉదయభాను వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆరాధన సంప్రదాయాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పతనంతిట్టలోని కొన్ని ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… పాములను, కోతులను కూడా హిందువులు ఆరాధిస్తారని అవమానపరిచారు. అలాగే ఈ సమయంలో చైనా దేశాన్ని బాగా మోశారు. చైనీయులు పాములను, కోతులను తింటుంటే… భారత్ లో మాత్రం వీటిని ఆరాధిస్తారంటూ అవహేళన చేశారు. భారత సాంస్కృతిక పద్ధతులు అత్యంత పాతవని, చైనా వంటి ఇతర దేశాల కంటే ఘోరంగా వున్నాయన్నారు. అలాగే పందిని శ్రీ మహావిష్ణువు అంటూ పూజలు చేస్తున్నారని అపహాస్యం చేశారు.

ముందు నుంచి కూడా కుహానా లౌకిక మేధావులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు సనాతన హిందూ ధర్మాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇస్లాం, క్రైస్తవం లాంటి విషయంలో మాత్రం నోరు మెదపరు. వారికి భయపడతారో… లేక.. ఎందుకో తెలిదు కానీ.. వారి పద్ధతులను మాత్రం విమర్శించరని, వారి పద్ధతిని వెంటనే మార్చుకోవాలని కేరళ హిందువులు డిమాండ్ చేస్తున్నారు.

భారతీయ ధర్మంలో ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం వుందని, అందుకే తమ మనోభావాలపై సీపీఎం దాడి చేసిందంటూ మండిపడ్డారు. జంతువుల్లో, మొక్కల్లో, ఇలా ప్రతి దానిలో ఆత్మను దర్శించే సంస్కృతి అని, అదేమీ తెలుసుకోకుండా కువిమర్శలు చేస్తున్నారని అన్నారు.