News

మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం

11views

యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిలా గ్రామంలోని శివ మందిరం దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఈ పంచాయితీలోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధువులు, సంతులతో పాటు వందలాది గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు ఈ పంచాయితీకి హాజరయ్యారు. హిందూ సమాజం కులమతాలకు అతీతంగా ముందుకు సాగాలని, ఇందుకు అందరూ కలిసి రావాలని స్వామి దీపంకర్ మహారాజ్ పిలుపునిచ్చారు. హిందూ సమాజం మొత్తం సమాజం కోసం ఏకం కావాల్సిన అవసరం వుందన్నారు.
మరోవైపు హిందూ సమాజంలోని అన్ని వర్గాలూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వుందని సాధ్వీ ప్రాచి సూచించారు. హిందువులను మోసం చేయడానికి, కుట్ర ప్రకారం కొందరు హిందూ వ్యతిరేకులు హిందూ పేర్లు పెట్టుకొంటున్నారని, జాగ్రత్తగా వుండాలన్నారు. వారికి హిందువుల పేర్లపై అంత అభిమానం వుంటే.. వారి విశ్వాసాన్ని మార్చుకొని, హిందువులుగా మారాలని డిమాండ్ చేశారు. అలాంటి వారిని తాము స్వాగతిస్తామన్నారు. ఆహార పదార్థాలు, పానీయాల్లో మూత్రం పోయడం, ఉమ్మి వేయడం చేసే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వీరు డిమాండ్ చేశారు. అలాగే జనాభా నియంత్రణకు చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఈ పంచాయితీ సభ్యులు సీఎం, స్థానిక ఎమ్మెల్యేకి, పోలీసు అధికారులకు ఓ మెమోరండం సమర్పించారు. అంతేకాకుండా జాతీయ భద్రతా చట్టం కింద ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే నెల 13 న 29 ఏళ్ల జ్యూస్ ని అమ్మే వ్యక్తి జ్యూస్ లో మూత్రం పోసిన ఘటన జరిగింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అతని దగ్గర వుండే మైనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జ్యూస్ లో మూత్రం కలిపి అందరికీ ఇస్తున్నాడని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు.