News

రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.

15views

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్‌…
రాష్ట్రంలోని విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న దేవాలయాలపై గట్టిగానే పడింది. ఆయా ఆలయాల్లో ప్రసాదాలను ఆవు నెయ్యితోనే తయారు చేస్తున్నారా? నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనేదానిపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది.

శాంపిల్స్‌ సేకరణ..
అన్ని అలయాల్లోనూ నెయ్యి క్వాలిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. సింహాచలం, అన్నవరంలో ప్రసాదాల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్‌ ఘీ చేపట్టింది ప్రభుత్వం. దీనిలో భాగంగాలో సింహాచలంలో తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. ప్రసాదం నాణ్యతను పరిశీలించి రికార్డులను చెక్‌ చేశారు గంటా. లడ్డూ బరువును తూకం వేసి పరిశీలించారు. తక్కువ రేట్లకు నెయ్యి కొంటే..దానిలో క్వాలిటీ ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు.

రెండేళ్లుగా ఒకరికే టెండర్‌
ఇక అన్నవరం ప్రసాదంపై కూడా ఆరోపణలు రావడంతో…ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు. ప్రసాదం నాసిరకంగా ఉందని ఆరోపణలు రావడంతోనే తనిఖీలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే. 6 నెలలకు ఒకసారి టెండర్‌ను మార్చాల్సి ఉందని, అయితే రెండేళ్లుగా ఒకే వ్యక్తికి టెండర్‌ ఇచ్చారన్నారు సత్యప్రభ. ప్రసాదంలో వాడే పదార్థాల శాంపిల్స్‌ను సేకరించామని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు.

ఇలా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల పరీక్ష, టెండర్ల తనిఖీ, వస్తువుల క్వాలిటీ చెకింగ్‌ చేపడుతున్నారు.