News

ఆధ్యాత్మిక దృక్పథమే భారత్ ప్రత్యేకత : మన్మోహన్ వైద్య

28views

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకారిణీ సదస్యులు మన్మోహన్ వైద్య శ్రీనగర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి గంగ అని, దానగుణం ఇందులో నిబిడీకృతమై వుందన్నారు. దీంతో ప్రతి ఒక్కరినీ ఆదరిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం భారత దేశ ప్రాథమిక అంశమని, భారతీయ జీవన తత్వశాస్త్రం పాశ్చాత్య వాదాన్ని తిరస్కరిస్తుందన్నారు.

జాతీయంగా వుండటం ఓ గుణాత్మకమైందని, భారత్ లో దేశం అనే భావన సమాజ ఆధారితమైందన్నారు. ఆధ్యాత్మిక దృక్పథమనేది భారత్ ప్రత్యేకత అని, అనేక తరాలుగా భారత్ లో పారిశ్రామికత సమాజంగా వుందని, నైపుణ్యాల అభ్యాస కేంద్రాలకు భారత్ ఆలవాలమని తెలిపారు. జ్ఞానమనేది ఇక్కడ తరతరాలుగా భద్రపరిచే వుందని, అందర్నీ కలుపుకొని వెళ్లే, మేధోపరమైన, ప్రగతిశీల విధానంతో ప్రపంచ వేదికపై భారత్ తన సొంత సాంస్కృతిక గుర్తింపును సృష్టించుకుందన్నారు.