News

బాపట్లలో శ్రీలంక సంస్కృతి సాంప్రదాయాలు

47views

శ్రీలంక దేశంలోని సిలోన్‌ గ్రామంలోని ఆచారాలను బాపట్ల జిల్లా, చీరాలలో ఓ కాలనీ వాసులు నిత్యం ఆచరిస్తుంటారు. అక్కడి ఆచారాలే.. ఇక్కడ ఆనవాయితీలు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం శ్రీలంక నుంచి వేటపాలెంలోని, దేశాయిపేటలో నూలు మిల్లులో పని చేసేందుకు వచ్చిన తమిళులు ఇక్కడే స్థిరపడిపోయారు.ఇక్కడ స్థానికంగా నివాసముండే కాలనీ పేరు కూడా సిలోన్ కాలనిగానే నామకరణం చేసుకున్నారు. అంతేనా ఇక్కడ తమ ఆరాధ్య దైవమైన శ్రీముత్తుమారియమ్మ అమ్మవారికి ఓ ఆలయాన్ని కట్టించుకున్నారు.వారి సంప్రదాయాలను,సంస్కృతిని అన్నింటా పాటిస్తున్నారు.

ఈక్రమంలోనే గడచినా 30 ఏళ్లుగా తమిళీయుల ఆరాధ్య దైవం శ్రీ ముత్తుమారియమ్మన్ తిరునాళ్ళ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు . అమ్మవారి తిరునాళ్ల మహోత్సవానికి 41 రోజుల ముందు నుంచే అత్యంత కఠినంగా దీక్షలలో వుంటారు. ఆ తదుపరి అమ్మవారికి తిరునాళ్ల మహోత్సవాన్ని క్రమం తప్పకుండ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా ముత్తు మరియమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా జాండ్రా పేట శివాలయం వద్ద నుంచి దేశాయిపేట వరకు మహిళలు అత్యంత భక్తిశ్రేదాలతో కళాశాలతో నాగరోత్సవంలో పాల్గొన్నారు.

నగరోత్సవంలో భాగంగా శరీరానికి శూలాలను గుచ్చుకొని క్రెన్ ద్వారా గాలిలో వేలాడుతూ అమ్మవారి పట్ల తమకున్నభక్తి భావాలను చాటుకునారు. ఇక గాలిలో వేలాడుతున్న ఒళ్ళు గగూరుపుడిచే దృశ్యాలు భక్తులను ఆశ్చర్యానికి గురిచేశాయి.అలా కొన్ని క్షణాలు నిమిషాలు కాదు గంటలు తరబడి గాల్లో వేలాడుతారు. మరో పక్క నోటికి శూలాలను గుచ్చుకొని, కొబ్బరికాయలను వీపుకు శూలాలు గుచ్చుకొని లాక్కెళ్లి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఆనవాయితీ శ్రీలంకతో పాటుగా మనదేశంలో తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, గుంతకల్లు, రాజమహేంద్రవరం, చీరాలలో మాత్రమే జరుగుతాయని కాలనీ వాసులు తెలిపారు .