News

బెంగాల్‌ సరిహద్దుల్లో వేల మంది బంగ్లాదేశీయులు… అత్యధికులు హిందువులే

39views

హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎస్‌ఎఫ్‌ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి. వీరిలో అత్యధికులు హిందువులు కావడం గమనార్హం. గత సోమవారం ఆ దేశప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ హిందువులు , బౌద్ధులు, ఇతర మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. వారి ఆస్తులు, వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారు. అవామీలీగ్‌ పార్టీకి చెందిన ఇద్దరు హిందూ నేతలు హత్యకు కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాణభయంతో పలువురు భారత్‌ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ బలగాలు భారీగా మోహరించాయి. శుక్రవారం బెంగాల్లోని కూచ్‌బిహార్‌ జిల్లా సీతల్‌కుచీ సరిహద్దు కంచె దూకి వచ్చేందుకు వెయ్యి మంది ప్రయత్నించగా భారత బలగాలు వమ్ముచేశాయి. సరిహద్దుకు సమీపంలో వారంతా సమావేశమై తమను భారత్‌కు రానివ్వాలని నినాదాలు చేశారు.