News

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు : కమిటీ వేసిన కేంద్రం

46views

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండెంట్ ఏడీజీ నేతృత్వంలో కమిటీ వేసినట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో తీవ్ర హింస చెలరేగడంతో వేలాది మంది భారత సరిహద్దులకు చేరుకుంటున్నారు. భారత్ సరిహద్దులను మూసివేసింది.4096 కి.మీ సరిహద్దులో భద్రతను పెంచింది.

బంగ్లాదేశ్‌లో కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రధాని యూనస్, మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. దాడుల్ని ఆపడం తమ ప్రథమ కర్తవ్యమని యూనస్ చెప్పారు. అయితే బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది.