News

ఆంగ్ల పత్రిక ”ఫ్రంట్ లైన్” కి షోకాజ్ నోటీసులిచ్చిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

44views

ఇంగ్లీష్ పత్రిక ఫ్రంట్ లైన్ కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ నెల సంచికలో ఆ పత్రిక భారత దేశ మ్యాప్ ను తప్పుగా చూపించింది. ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. మ్యాపులో భౌగోళిక సరిహద్దుల విషయంలో పత్రిక తప్పుగా చూపించింది.దీనిని ప్రెస్ కౌన్సిల్ తప్పుబట్టింది. అంతేకాకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ పత్రిక ఎడిటర్ కి అధికారికంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పత్రికలో అచ్చైన తప్పుడు మ్యాప్ విషయంలో వివరణ, అలాగే దానిని సరిదిద్దడానికి తీసుకున్న చర్యలేమిటో తెలపాలని ఆదేశించింది.