News

బంగ్లాలో హిందువులపై దాడులను అడ్డుకోవాలి…. అమెరికా చట్టసభ సభ్యులు

48views

బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను భారతీయ అమెరికన్‌ చట్టసభ (కాంగ్రెస్‌) సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఖండించారు. ‘బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన పోరాటం న్యాయసమ్మతమైనది. అయితే, హిందువులు లక్ష్యంగా ఆ దేశంలో జరుగుతున్న దాడులను ఆపాలి. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యూనస్‌ చర్యలు తీసుకోవాలి’ అని ఎక్స్‌లో రో ఖన్నా పేర్కొన్నారు. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలపై జరుగుతున్న దాడులను తక్షణం ఆపటానికి అధికారులు, పోలీసులు కృషి చేయాలని, దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని రాజా కృష్ణమూర్తి ఒక ప్రకటనలో కోరారు. కాగా, బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ప్రభుత్వం ఖండించకపోవటాన్ని పలు హిందూ అమెరికన్‌ సంఘాలు తప్పుబట్టాయి. దాడులను ఆపటానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేర కు ‘ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడం’ అమెరికా రాయబారి రషద్‌ హుస్సేన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు