ArticlesNews

ప్రపంచ స్థానికుల దినం – ఒక పరిశీలన

53views

( ఆగష్టు 9 – ప్రపంచ స్థానికుల దినం ప్రత్యేకం )

స్థానికులు – భారతదేశం
దేశంలో ప్రతి సంవత్సరం ఆగష్టు 9 వ తేదీన ప్రపంచ స్థానికుల దినం పేరుతో వేర్వేరు స్థలాల్లో చిన్న పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటిలో వనవాసీ సమాజంతో బాటు ఇతర వ్యక్తులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. అలాంట కార్యక్రమంలోనూ ఎక్కువగా చర్చి లేదా దాని ద్వారా పరేపితమైన సంస్థలు – వ్యక్తులు చేస్తుంటారు.. వాటికి తమదైన నిర్దిష్ట (మత మార్పిడి) ఉద్దేశ్యం ఉంటుంది. ఈ విషయం గురించి పూర్తి సమాచారం లేని కారణంగా జనజాతి సమాజం, మనలోని కొందరు ఉత్సాహవంతులైన వ్యక్తులు ఆ వాతావరణంతో మునిగిపోతుంటారు. అందువల్ల ఈ విషయాన్ని లోతుగా అర్ధం చేసుకోవడం అవసరం.

చరిత్ర
స్థానికులనే విషయంలో ఐక్యరాజ్యసమితి భావన భారతదేశానికి సంబంధించి వర్తిస్తుందా లేదా అనేదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలో సుమారు 40 దేశాలలో 43 కోట్ల మంది స్థానికులు ఉన్నారు. వారిలో సుమారు 25% భారతదేశంలోనే ఉన్నారు. మొదట ఈ విషయం అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉండేది. అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మాన సంఖ్య 169 (1989) ద్వారా ఈ విషయం ప్రారంభమైంది.

ఐక్యరాజ్యసమితి ప్రపంచ స్థానికుల స్థితిని సంస్కరించడంతోపాటు, వారి వికాసం, వారి అభిరుచులను, హక్కులను రక్షించడం కోసం స్థానికులకు సరైన వేదికను 2000 సంవత్సరం జూలై 28న స్థాపించింది. గతంలో ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలలో తమ వలసలను స్థాపించి తమ సామ్రాజ్యాలను ఏర్పరచుకున్నాయి. ఈ ప్రక్రియలో వాళ్లు అక్కడ నివసించే స్థానికులను బానిసలుగా చేసుకొని వారిని అక్కడి నుంచి తరిమికొట్టడం ద్వారా వారి సంస్కృతి, జీవితాదర్శం, రీతి-రివాజులు, విలువలను, మతాన్ని నాశనం చేశాయి. భూమితో పాటు వారి ప్రకృతి వనరులను బలవంతంగా కబ్జా చేశారు. భారతదేశంలో కూడా ఇలాగే నాశనం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో ఇప్పటివరకు దీని పరిభాష నిశ్చయం కానే లేదు.

ఆస్ట్రేలియాలో నైతే అక్కడ ప్రస్తుత ప్రధానమంత్రి కెవిన్ రూడ్ 2008 ఫిబ్రవరి 13న అక్కడి పార్లమెంట్లో, స్థానికుల నుండి క్షమాపణలు కోరాల్సి వచ్చింది. స్థానిక ప్రజల నుంచి దోచుకుపోయిన తరాల వారి పట్ల జరిగిన అన్యాయం విషయంలో ఇలా అతను అడగాల్సి వచ్చింది. అక్కడి స్థానిక ప్రజల చిన్నపిల్లలను లాకెళ్లి చర్చి లేదా ఇతరులకు అప్పగించడం జరిగింది. ఇదంతా వారిని ప్రధాన సమాజంలో కలిసిపోవడానికి వారి స్వంత గుర్తింపును నాశనం చేయడానికి జరిగింది.

భారతదేశంలో జనజాతుల వారు ఎవరు బయట నుండి వచ్చిన వారు కాదు, పౌరాణిక కాలం నుంచి ఇక్కడ అన్ని జాతులు – జన జాతీయులు సౌహార్ధ పూర్వకంగా ఉంటూ వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రభుత్వ ప్రతినిధి కూడా 2007లో తీర్మానంపై సంతకం చేసే సమయంలో ఇదే చెప్పారు. భారతదేశంలో జీవించే ప్రజలందరూ ఇక్కడి స్థానికులే మాలో ఎవరు బయట నుండి రాలేదని చెప్పడం జరిగింది.

స్థానికుల విషయంలో ఐక్యరాజ్యసమితిలో భారత దేశపు ప్రకటన
భారతదేశంలోని స్థానికుల అధికారాలను నిరంతరం భారతదేశం సమర్ధిస్తూ వస్తోంది. స్థానికుల అధికారాలను ప్రకటించే పని చేసింది. ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టబడిన ఈ పాఠం 11 సంవత్సరాల కఠిన పరిశ్రమ ఫలితం. ఈ పాఠంలో “స్థానికులు” అనే పరిభాష లేదు భారతదేశంలోని మొత్తం జనాభాను ఆత్మ నిర్ణయాధికార సంబంధంతో స్థానికులుగా భావించడం జరిగింది. ఇది కేవలం విదేశీ బానిసత్వంలో ఉన్నవారికి మాత్రమే అన్వయిస్తుంది తప్ప దేశంలోని స్థానికుల విషయంలో ఇది అన్వయించబడదు. భారతదేశం ఈ తీర్మానాన్ని సమర్థించడం, రూపొందించబడిన ప్రకటనకు అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. మేము దీనిని సమర్థిస్తూ ఓటు వేయబోతున్నాము.

ఐక్యరాజ్యసమితి ద్వారా స్థానికులకు అధికార పత్రం 13 సెప్టెంబర్ 2007
2007 సెప్టెంబర్ 13న ఐక్యరాజ్యసమితి ద్వారా స్థానికుల అధికారాల గురించి ప్రకటన చేయబడింది. దాన్ని భారతదేశం కూడా.. ఈ దేశంలోని వారందరూ స్థానికులు ఎవరు బయట నుండి రాలేదని చెబుతూ సమర్ధించడం జరిగింది. 143 దేశాలు ఆ తీర్మాన ప్రకటనను సమర్ధించాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా మొదలగు నాలుగు దేశాలు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 13 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఈ ప్రకటనలో స్థానికులకు చెందిన అనేక అధికారాలను అంగీకరించడం జరిగింది. అయితే ఇందులో అన్నింటికల్లా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఆత్మ నిర్ణయాధికారం విషయంలోనే, ఈ అధికారమనేది ఏ దేశాన్ని అయినా మొక్కలు మొక్కలుగా విభజించడానికి కూడా దారి తీయవచ్చు. అందులో కొన్ని సార్వభౌమ దేశం లేదా జాతీయ సమాజాన్ని అంగీకగదించకపోవచ్చు.

46 అంశాలతో కూడిన ఈ అధికారిక ప్రకటనలోని వ్యాఖ్యను విశ్లేషిస్తే వీటిలో అనేక అంశాలు భారతదేశంలోని జన జాతులకు భారతీయ రాజ్యాంగం 1952 లోనే వీటిని అందజేసినట్లు దానిని మరింత విస్తరించే ప్రక్రియ ఇప్పటికీ అమలులో ఉందని అర్థమవుతుంది. రాజ్యాంగంలోని 5V,6T అనుసూచిక కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలలో జన జాతీయ ఆదివాసీ అభివృద్ధి శాఖ, జాతీయ-రాష్ట్రాల జనజాతి కమిషన్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలలో జనజాతుల జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు, వారి విద్య-ఆరోగ్యం-నివాసం-త్రాగునీరు మొదలగు వాటి కొరకు విశేష ప్రయత్నం, పార్లమెంట్, శాసనసభల్లో ప్రాతినిధ్యంలో రిజర్వేషన్, వ్యవసాయ భూమి రక్షణ కొరకు రక్షణాత్మక చట్టం, వారి పరంపర, ఆచార్య వ్యవహారాలు, ఆచారాల చట్టాలకు గౌరవం, అత్యాచార నివారణ చట్టం, విశేష పంచాయితీ చట్టం వన అధికార చట్టం-2006 ఇలాంటివి కొన్ని దీనికి ఉదాహరణలు. జన జాతుల గురించి ఇంత సంరక్షణ వారి అభివృద్ధి కొరకు ఎంత ప్రయత్నం బహుశా ఏ దేశం ద్వారాను జరగలేదు. పశ్చిమ దేశాలలోగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా సమాజం ఇక్కడి జనజాతులను ఏ రకంగానూ వేధించలేదు. ప్రపంచంలోనే అనేక దేశాలలో అక్కడి స్థానికులను సంపూర్ణంగా, వారి సంస్కృతితో పాటు నాశనం చేయడం జరిగింది. అమెరికాలోని రెడ్ ఇండియన్స్ లేదా ఆస్ట్రేలియాలోని ప్రాచీనమైన స్థానిక ప్రజలపై సామ్రాజ్యవాద శక్తులు చేసిన అత్యాచారాలు తథాకధిత నాగరిక ప్రజల దుష్కృతాలకు ప్రత్యక్ష ఉదాహరణలు.

మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా స్థానికులు నేటివ్ లేదా ఆదివాసి అనే పదాలను ఉపయోగించలేదు కానీ ఆస్ట్రేలియా కెనడా అమెరికాలో ఈ రకంగా ఉన్న ప్రజల విషయంలో ఈ పదాలను వాడడం జరిగింది. మనదేశంలో జనజాతి అనుసూచిత జనజాతి అనే పదాలను వాడడం జరిగింది. దీని ద్వారా స్థానికుడు అనే భావనను మనదేశంలో ప్రచారంలో లేనేలేదని అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక విషయాన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఐక్యరాజ్యసమితికి చెందిన స్థానికుల విషయంలోని సంఘంలో ప్రస్తుతం 14 సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు కూడా భారతీయులు లేరు. ఈ సంఘం చరిత్రలో ఎప్పుడు ఏ భారతీయుడికీ స్థానమివ్వలేదు. దీని ద్వారా ప్రపంచ సంస్థ భారతీయ జన జాతులను ఇతర దేశాలలోని స్థానికుల హితరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్న అర్ధంలో స్వీకరించడంలేదనే విషయం స్పష్టమవుతుంది. భారతదేశంలోని జన జాతులను స్థానికులు అని పేరు పెట్టి వారితో బాటు ఇతర దళితులు – అనుసూచిత జాతులు (షెడ్యూల్డ్ క్యాస్ట్ )ను కూడా జోడించి మనలో మరొక జాతిని (రేస్) అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశం, భారతీయులు, జనజాతి సముదాయం, ప్రపంచంలోని స్థానికులై వంచితులైన వారి అధికారాలను సమర్థించడం జరుగుతుంది. అయితే సమర్థించాలనే ఈ పరుగులో మనం గుడ్డివాళ్ళమైపోయి మన వివేకాన్ని కోల్పోరాదు. జన జాతులను మోస మోసగించాలనుకునే వాళ్లే నేడు మన ధర్మ సంస్కృతులను, మన గుర్తింపును నాశనం చేయడంలో అందరికన్నా ముందున్నారని మనం మర్చిపోకూడదు. అనేక రూపాల వేషంతో తెరచాటున ఎవరు ఏం చేస్తున్నారన్నది అర్థం చేసుకోవడం, అర్థం చేయించాల్సిన అవసరముంది.

ఐక్యరాజ్యసమితి ప్రకటనలోని 12వ అంశం స్థానికుల ధార్మిక ఆధ్యాత్మిక విశ్వాసాల పూజా పద్ధతిని రక్షించుకునే అధికారిమిచ్చిందన్నది ప్రాధాన్యత కలిగిన విషయం.

స్వదేశ ప్రజలకు తమ ఆధ్యాత్మిక, ధార్మిక పరంపరలను, రితీ-రివాజులను, కార్యక్రమాలను జరుపుకునే, ప్రదర్శించుకునే, అభ్యాసం చేయడం, అభివృద్ధి చేయడం, నేర్పించడం అనే అధికారం ఉంటుంది. తమదైన ధార్మిక, సాంస్కృతిక స్థలాలను ఏర్పరచుకోవడం, సంరక్షించుకోవడం, రహస్యంగా ఉంచుకోవడం విషయంలో అధికారం ఉంటుంది. వారి కార్యక్రమాలలో వాడుకునే వస్తువులను ఉపయోగించడం, నియంత్రణలో ఉంచుకోవడం, అంతిమ సంస్కారం కోసం తమ సంబంధికులైన వారి మానవ అవశేషాలను వెనక్కు తీసుకోవడానికి అతనికి అధికారం ఉంటుంది.

అయితే దీనికన్నా ప్రాధాన్యం ఉన్న విషయం ఏమిటంటే భారత రాజ్యాంగం తన అనుసూచిత జాతులు, జన జాతులకు ఈ అధికారాలను ప్రపంచ స్థాయిలో ఈ విషయంపై ఆలోచించడం ప్రారంభించడానికి అనేక శతాబ్దాల ముందే ఇవ్వడం జరిగింది.

( మూలం : డాక్టర్ రాజ్ కిశోర్ హసదా , జాతీయ సహా సంయోజక్, జన జాతీయ సురక్షా మంచ్ గారి ఒక వ్యాసం ఆధారంగా )
అనువాదం : బ్రహ్మానందరెడ్డి