News

బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలి: జగ్గీ వాసుదేవ్‌

64views

వుల దుకాణాలు, ఇళ్లపై దాడులు, లూటీలు జరిగినట్లుగా బంగ్లాదేశ్‌ వార్తాసంస్థలు వెల్లడించడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. హిందువుల ఇళ్లపై ముష్కరులు మారణాయుధలతో ఎగబడి హత్యలు, లూటీలకు పాల్పడ్డట్టు, దినాజ్‌పూర్‌లోని బోచాగంజ్‌లో హిందువులకు చెందిన 40 దుకాణాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని కనీసం 27 జిల్లాల్లో హిందువుల ఆలయాలు, నివాసాల్లో అల్లరిమూకలు లూటీలకు పాల్పడినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై ఈశా ఫౌండేషన్‌ ఆధ్యాత్మిక నేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు మద్దతుగా నిలవాలని, ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లాలో హిందువుల పట్ల జరుగుతున్న అరాచకాలు ఆ దేశ అంతర్గత వ్యవహారం కోణంలో చూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒక్కప్పుడు మన దేశంలో భాగంగా ఉన్న బంగ్లా దురదృష్టంకొద్దీ మన పొరుగు దేశమైందని.. అక్కడి హిందువులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని.. ఒకవేళ మనం వారికి మద్దతుగా నిలవకపోతే భారత్‌ అనేది మహా భారత్‌ అవ్వలేదని స్పష్టం చేశారు. బంగ్లాలో ముష్కలరులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం, వారిపై దాడులకు పాల్పడటాన్ని యోగా గురు బాబా రామ్‌దేవ్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. దీన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వెంటనే చేపట్టాలంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కాగా బంగ్లా నాటోర్కోలో సుమారు 15వేల మంది హిందువులు, 7వేల మంది క్రిస్టియన్లు నివసిస్తున్నారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపామని వారు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై లక్ష్యిత దాడులు జరుగుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. సనాతన ధర్మానికి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, హిందువులు తదితర మైనారిటీ వర్గాలపై, వారి ప్రార్థన స్థలాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్‌లోని 31 సామాజిక, సాంస్కృతిక సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి