News

ఖాండ్వాలోనూ కలియుగ దైవం

326views

తిరుమల తిరుపతి ఏడుకొండలవాడు మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో మరింత దివ్యంగా దర్శనమిస్తున్నాడు. 81 అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశుని ప్రతిమను అక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. పర్యాటక రంగం విస్తరణ కోసం ఈ ఏర్పాటు చేశారు. దివ్యబాలాజీనగర్ లో ప్రతిష్ఠించిన ఈ ప్రతిమ ఆధునిక కాలపు శిల్పకళా అద్భుతంగా చెబుతున్నారు. పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యాలతో నిత్యం దర్శనం ఇచ్చే ఈ ప్రతిమకు అన్ని రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని వల్ల, విద్యుత్ వల్ల ఎలాంటి ఆపద రాకుండా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక వనంలో, ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫౌంటేన్ సహా స్వామివారి ప్రతిమను దర్శించుకోవచ్చు. ఇక ఉన్నత ప్రమాణాలు కలిగిన లేజర్ దీపాల కాంతులు సరేసరి. ఈ స్వామివారితో మొత్తం 50 కుటుంబాల వారు ఉపాధి పొందుతారు.