News

ఆ హిందూ బాలిక ఏమైంది?

51views

ఆగస్ట్ 19,2021న ఆ బాలిక కనిపించకుండా పోయింది. ఇప్పటికి కూడా ఆచూకీ లేదు. ఇది పాకిస్తాన్లో జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు రాజ్కుమార్ పాల్, వీణాకుమారి సహా వందలాది మంది జూలై 19న తమ చిన్నారి ఏమైందో చెప్పా లంటూ కరాచీ నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నా బాలిక ప్రియాకుమారి. కనిపించకుండా పోయే నాటికి ఆ బాలిక వయసు ఏడేళ్లు. అదే రోజున ఆమె మొహర్రం ఉత్సవంలో అతిథులకి పానీయాలు అందిస్తుండగానే హఠాత్తుగా కనిపించకుండా పోయింది.

ఇదంతా సంగ్రార్ అనే చోట (సింధ్ ప్రాంతం) జరిగింది. మూడేళ్ల తరువాత అధికారులు మళ్లీ అదే హామీ ఇచ్చారు. వెతుకుతున్నాం, కొన్ని శాఖలను కలిపి కూడా బాలిక కోసం వెతుకుతున్నాం ఇంతే జవాబు. ఈ హామీ పడేసిన వారు సింధ్ హోంమంత్రి జియా లాంగ్రోవ్, పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ జావెద్ ఓధా. దీనితో మూడేళ్ల తరువాత కూడా ప్రియాకుమారి అదృశ్యం గురించి ఒక్క ఆధారం కూడా సంపాదించ లేక పోయామని ఆ పెద్ద పోలీసు చెప్పిన తరువాత చేసేదేముంది? అసలే పాకిస్తాన్లో హిందువులు నిరంతరం భయంతో వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే బాలికలకే కాదు, యువతు లకూ, వివాహితులకూ కూడా అక్కడ రక్షణ లేదు. హిందూ స్త్రీలను అవహరించుకుపోవడం చాలా ప్రాంతాలలో సర్వసాధారణం.

ఇలా అపహరించుకు పోయిన వారిని మతం మారుస్తారనీ, తరువాత వృద్దులకు ఇచ్చి కట్టబెడతారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ప్రియాకుమారి తల్లి దండ్రులారా! మీరు ప్రపంచం దద్దరిల్లేటట్టు విలపించినా ప్రపంచంలో ఉన్న ఉదారవాదులు, సెక్యులరిస్టులు స్పందించరు. మహిళా సంఘాలు, ఫెమినిస్టులు ఇటు చూడరు కూడా. ఇలా చేసే హక్కు ముస్లింలకు ముస్లిం దేశాలకు ఉందని వారి నమ్మకం. ఇది చాలాసార్లు రుజువైంది.