News

కార్గిల్ యుద్ధకారకుడు పర్వేజ్ ముషారఫ్‌కు కేరళలో నివాళి..!?..దేశభక్తుల మండిపాటు

62views

కార్గిల్ యుద్ధానికి కారకుడైన పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్‌కు ఆరాధ్యుడిగా మారాడు. ఔను, కేరళలోని అలప్పుజాలో జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తమ రాష్ట్ర సదస్సులో నివాళులు సమర్పించేందుకు సిద్ధ పడింది. ఈ మేరకు సదరు బ్యాంక్ యూనియన్ రాష్ట్ర కమిటి విడుదల చేసిన కార్య పత్రంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన మన వీర జవాన్లకు జూలై 26న యావత్ దేశం నివాళులు అర్పించిన సమయంలో పర్వేజ్ ముషారఫ్ ఉదంతం వెలుగు చూసింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇండియా తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో నివాళి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో అసలు ముషారఫ్ పేరు ఎలా జాబితాలోకి వచ్చిందో తెలియడం లేదని, ఎక్కడో పొరపాటు జరిగిందంటూ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.

మరోవైపు ముషారఫ్‌కు నివాళి అర్పించాలని వామపక్ష ప్రేరేపిత బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ పై నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సదరు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ ఉదంతం పై సమగ్ర దర్యాప్తు చేసి ఉద్యోగులపై తగు చర్యలు తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియాను పలువురు దేశభక్తులు డిమాండ్ చేశారు.