News

జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బ్లూ మసీదుతో సహా మరో నాలుగు మసీదుల మూసివేత

68views

జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి సంపూర్ణ మద్దతు ఇస్తోందని హాంబర్గ్‌లోని ప్రసిద్ధమైన బ్లూ మసీదుతో సహా మరో నాలుగు మసీదులను మూసేసింది. ఈ విషయాన్ని జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రి నాన్సీ ఫేజర్‌ ప్రకటించారు. అయితే… తాము ఏ ఒక్క మతానికో వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని, అలాగే మహిళల హక్కులను పూర్తిగా కాలరాయాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మసీదులు ఇస్లామిక్స్‌ జెంట్రమ్‌ హాంబర్గ్‌ అనే సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఇస్లామిక్స్‌ జెంట్రమ్‌ హాంబర్గ్‌ అనే సంస్థ ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని, నిరంకుశత్వాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తోందని జర్మన్‌ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు జర్మన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ జర్మన్‌ రాయబారిని పిలిపించి, మాట్లాడినట్లు తెలుస్తోంది. తమ హక్కులను హరించివేస్తోందని ఇరాన్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

బ్లూ మసీదు అనేది జర్మనీలోని పురాతన మససదులలో ఒకటి. దీనిపై నీలిరంగు వేసి వుంటుంది కాబట్టి దీనిని బ్లూ మసీదు అని పిలుస్తారు . అయితే.. ఇస్లామిక్స్‌ జెంట్రమ్‌ హాంబర్గ్‌ అనేది ఇరానియన్‌ పాలన కొనసాగింపుగానే పరిగణిస్తారు ఈ సంస్థ జర్మనీలోని కొన్ని మసీదులను తమ గుప్పిట్లో పెట్టుకుందని, విపరీతమైన పట్టును పెంచుకున్నట్లు జర్మన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా వీరు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాలతో కూడి సన్నిహిత సంబంధాలు కలిగి వున్నట్లు ప్రభుత్వం తెలిపింది ప్రజలలో తీవ్రమైన నిరంకుశత్వాన్ని నింపుతున్నారని పేర్కొంటున్నారు. ఇదో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అని, ప్రజల్లో రాజ్యాంగ వ్యతిరేక లక్షణాలన్నింటినీ నూరిపోస్తున్నారని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి విప్లవాత్మక ధోరణులు అలాగే మిలిటెంట్‌ పద్ధతులను కూడా వ్యాప్తి చేస్తోందని పేర్కొంది.అలాగే జర్మన్‌ సమాఖ్య రాష్ట్రాలు బ్రెమెన్‌, బవేరియా, మెక్లెన్‌ బర్గ్‌, పోమెరేనియా హెసే లోయర్‌ సవక్సోసీ, బెర్లిన్‌లలోఇస్లామిక్స్‌ జెంట్రమ్‌ హాంబర్గ్‌ అనుబంధ సంస్థలపై కూడా దర్యాప్తు జరుగుతోందని, 53 రకాలుగా వున్న ఆస్తిపాస్తులపై సోదాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.