News

ఆర్ఎస్ఎస్ పై కేంద్ర నిర్ణయం సముచితం : సునీల్ అంబేకర్

60views

ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చన్న కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయంపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ స్పందించింది. ”రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం మరియు సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై ఉంది. జాతీయ భద్రత, ఐక్యత , సమగ్రత మరియు ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోపని చేస్తున్న సంఘ్ పాత్రను ఎప్పటికప్పుడు దేశంలోని వివిధ రకాల నాయకత్వం ప్రశంసించింది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, సంఘ్ వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం నిరాధారంగా నిషేధించింది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైనది మరియు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయబోతోంది.” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.
https://x.com/RSSorg/status/1815288116619719100?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1815288116619719100%7Ctwgr%5E10aef75f4d7bf45fed53c77b8e8fb2daf28d9903%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vsktelangana.org%2FEncyc%2F2024%2F7%2F22%2Frss-react-govt-decision-to-lift-ban-on-employees-participating-rss-activities.html