News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.. గత కాంగ్రెస్ ఉత్తర్వులన్నీ రద్దు

210views

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది.ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గత 40 ఏళ్లలో జారీ చేసిన మూడు వేర్వేరు ఉత్తర్వులను రద్దు చేసింది ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేర్వేరు సమయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ఉద్యోగుల పాల్గొనకుండా నిషేధించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కఠిన నిబంధన కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ కార్యక్రమాల్లో గానీ, సంఘ్ శాఖ కార్యక్రమాల్లో గానీ పాల్గొనకుండా చేసింది. ఈ నిబంధనను రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లతో పాటు ఇతర సౌకర్యాలను పొందే వారికి సైతం వర్తింపజేసింది.

మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన పురుషోత్తం గుప్తా ఈ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండోర్ లోని హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జూలై 9న విచారించిన న్యాయస్థానం కేంద్ర ఉద్యోగులపై నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.