News

భోజ్ శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టుకు శాస్త్రీయ సర్వే నివేదిక

55views

మధ్యప్రదేశ్లోని ప్రాచీన కట్టడం భోజ్ శాల వివాదానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) సోమ వారం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. రెండు వేలకు పైగా పేజీలతో ఉన్న భారీ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి ఏఎస్ఐఐ తరపు న్యాయవాది హిమాన్షు జోషి అందజేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22 జరగనుం దని జోషి తెలిపారు. 11వ శతాబ్దంనాటి ఈ ప్రాచీన కట్టడాన్ని హిందువులు సరస్వతీదేవి ఆలయం (భోజ్ శాల) గా, పేర్కొంటున్నారు. భోజ్శా లలో మంగళవారం రోజు హిందువులు పూజలు, శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించుకొనేలా 21 ఏళ్ల క్రితం ఓ ఏర్పాటు జరిగింది. అయితే, దీనిని హిందూ సంస్థ సవాల్ చేయడంతో వివాదం మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరింది. శాస్త్రీయ సర్వేకు న్యాయ స్థానం ఆదేశించడంతో దాదాపు నాలుగు నెలల తర్వాత ఏఎస్ఐ సోమవారం నివేదికను అంద జేసింది. శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలన్న ముస్లింల తరఫు అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.