ArticlesNews

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు : డా. మోహన్ భగవత్ జి

61views

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు వస్తుందని, అందుకోసం, ముందుగా ఆధ్యాత్మిక మేల్కొలుపు అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు, వారి దౌర్జన్యాలతో సమాజం కలవరపడిందని, అప్పుడు సాధువులు ఆధ్యాత్మిక జాగృతితో సమాజాన్ని మేల్కొల్పుతూ ప్రజలలో నిర్భయ భావనను రేకెత్తించారని ఆయన గుర్తు చేశారు.

మనం కూడా మన ప్రవర్తనలో సాన్నిహిత్యం, ఐక్యతను అలవర్చుకోవాలని, అప్పుడే సమాజంలో సామరస్యం సాధ్యమవుతుందని తెలిపారు. నాగపూర్ లో కార్యకర్తల అభివృద్ధి -11 శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు.సమాజంలో ఎవరిని అంటరానివారిగా పరిగణించి విడిగా ఉంచమని వేదాలు, ఉపనిషత్తుల నుండి ఎటువంటి మద్దతు లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు సమాజానికి ఐక్యత అవసరం అని డా. భగవత్ పిలుపిచ్చారు భారతీయ దృక్పథం ఆధునిక శాస్త్రాన్ని, ప్రాచీన విజ్ఞానాన్ని ఒక చోట చేర్చి కృషి చేయాలని ఆయన చెప్పారు. దీని కోసం, అభివృద్ధి ప్రమాణాలను భారతీయ దృక్పథం నుండి రూపొందించాలని డా. భగవత్ సూచించారు.

సంఘ్ పరివార్ నుండే సామాజిక సామరస్య సాక్షాత్కారం
భారతదేశం యుద్ధ భూమి కాదని, బుద్ధుడిదని చెప్పారు. కొన్నేళ్లుగా భారతదేశపు మతం, సంస్కృతిలపై దాడి జరుగుతున్నా భారతదేశపు సాధు సంప్రదాయం, సద్గురువులు దానిని రక్షించడంలో గొప్ప పని చేసారని ఆయన చెప్పారు. సంఘ్ పరివార్ సంస్కృతి, అంకితభావం, సామాజిక సామరస్యాన్ని బోధిస్తుందని తెలిపారు. తండ్రి మాటను పాటించిన శ్రీరాముడు మనకు ఆదర్శం అంటూ వివిధ సందర్భాల ద్వారా భారతీయ సంస్కృతి భావనను వివరించారు. సామాజిక జీవితంలో సామాజిక సామరస్య భావాన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు