News

బక్రీద్‌కు జంతువులను హింసిస్తే చర్యలు

56views

వైయస్సార్ జిల్లాలో ఈ నెల 17వ తేదీ బక్రీద్‌ సందర్భంగా జంతువులను వధించినా లేక అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పశుసంవర్థశాఖ అధికారి డాక్టర శారదమ్మ హెచ్చరించారు. సోమవారం ఇక్కడ ఆమె మాట్లాడుతూ జంతు సంరక్షణ కేంద్రాలను జిల్లాస్థాయిలో, గ్రామ పంచాయితీ స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశానుసారం కడప జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా డాక్టర్‌ రాజశేఖర్‌(9441614707), బాబునాయక్‌(9949298809)లను నియమించినట్లు తెలిపారు. గోవధ, జంతు సంరక్షణ చట్టం 1977, జంతు రవాణా నియమాలు 1978, 2001 స్లాట్టర్‌ హౌస్‌ రూల్స్‌ 2001పై చట్టాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నోడల్‌ ఆఫీసర్లకు సూచించారు. బక్రీద్‌ రోజున జిల్లాలోని ఉప సంచాలకులు జంతు సంరక్షణ చట్టాలను పాటిస్తూ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.