అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రాజమహేంద్రవరం శ్రీరామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంచార వైద్యశాలలో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరంలో రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. మేనేజర్ స్వామీ రఘువీరనంద మహరాజ్, ఆఫీస్ ఇంధార్జి స్వామి వేదవిద్యానందమహరాజ్ పర్యవేక్షించారు. వైద్యులు గోలి వెంకట రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, శ్రీకృష్ణ, టీవీ సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, సంపత్ కుమార్, జీఎస్ఎల్ డాక్టర్లు సేవలందిందారు. సుమారు 253 మందికి వైద్యం అందించినట్టు స్వామీజీ తెలిపారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 65 మందిని పరీక్షించారు. అవసరమైన 30 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ముగ్గురిని కంటి ఆపరేషన్లు నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రికి తరలించారు. క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వలంటీర్లు ఎల్డీవీ భగీరథ రాజు, ఉదయ్ కిరణ్, మంగిరెడ్డి, జయకుమార్, ఆదిత్య పాల్గొన్నారు.
238views
You Might Also Like
మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి
2
మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని అప్పయ్యరాజుపేట గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం లోని పెరియవరం గ్రామానికి చెందిన ఎద్దల మల్లికార్జున అనే...
రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై పరువు నష్టం దావా
2
నటుడు ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై...
దేశసేవను దైవసేవగా భావించిన పరమాచార్యులు
విద్యారణ్యులు జయంతి భారతదేశం పరాయి పాలనలో మగ్గుతున్న కాలం. మతమార్పిడులు పెచ్చుమీరిన సమయం. ఒకరోజు మహారాజు హరిహరరాయలు తన పరివారంతో వేటకు బయల్దేరారు. వారికి దారి చూపిస్తూ...
భక్తి, ముక్తి, సామాజిక సేవా దృక్పథాల కలయిక వైశాఖం
అక్షయ తృతీయ గంగానదితో సమానమైన పుణ్యతీర్థం లేనట్టే వైశాఖంతో సమానమైన మాసం లేదన్నది రుషివాక్యం. ఇది మాధవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన,...
‘హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’ – ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు
57
నటుడు ప్రకాశ్‌రాజ్ హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు, అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై టీటీడీ బోర్డు...
“ముచ్చటగా 34 ప్రశ్నలు” – ‘జనగణన’లో మిమ్మల్ని ఏం అడుగుతారో తెలుసా?
37
కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జన గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇదే సమయంలో కులగణన కూడా పూర్తి...





