News

14 వేలతో దక్షిణ భారత పుణ్యక్షేత్రాల దర్శనం.. వివరాలు ఇవిగో!

100views

దేశంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది. ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజీలో దక్షిణాదిన ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన భారత్ గౌరవ్ రైళ్లలో తాజా యాత్రను చేపట్టింది.

సందర్శించే ఆలయాలు ఇవే..
అరుణాచలం, రామేశ్వరం, మధురై మీనాక్షి ఆలయం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం.. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కోవలం బీచ్.

ట్రైన్ బయలుదేరేది ఇక్కడి నుంచే..
ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ, గూడురు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు.

ఛార్జీలు ఇలా..
ఎకానమీలో పెద్దలకు రూ. 14,250.. 5-11 ఏళ్ల పిల్లలకు రూ.13,250
స్టాండర్డ్‌లో పెద్దలకు రూ.21,900.. 5-11 పిల్లలకు రూ.20,700
కంఫర్ట్‌లో పెద్దలకు రూ.28,450.. 5-11 ఏళ్ల పిల్లలకు రూ.27,010