News

ఆ వివాహం చెల్లదు.. మతాంతర వివాహాలపై హైకోర్టు సంచలన తీర్పు

225views

మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం రిజిస్టర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లద్దని జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

1954 చట్టం ప్రకారం తమ వివాహం రిజిస్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన ప్రేమ జంట వినతిని తోసిపుచ్చింది. హిందూ యువతి, ముస్లిం యువకుడు చట్ట ప్రకారమే వివాహం చేసుకున్నా ముస్లిం చట్టం ప్రకారం మతాంతర వివాహం చెల్లదని జస్టిస్ గురుపాల్ సింగ్ స్పష్టం చేశారు.హిందూ అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చట్టబద్దం కాదని పేర్కొంది. ఇది ముస్లిం న్యాయ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తన ఉత్తర్వులో వెల్లడించింది.