ArticlesNews

అపర శంకరులు ఆ పరమాచార్యులు

91views

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు.

మన పతాకానికి మహాస్వామి నిర్వచనం: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చంద్రశేఖరేంద్ర స్వామి కంచిపీఠంలో ప్రసంగిస్తూ ‘మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. కాషాయరంగు సౌభాగ్యాలనిచ్చే మహాలక్ష్మిది. తెలుపు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిది. ముదురుపచ్చ మనల్ని రక్షించే పరాశక్తి రూపమైన దుర్గాదేవిది. దేవీశక్తుల ప్రతీకలే మూడు చారలుగా కనబడటం విశేషం. అపార ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి కావలసిన శక్తిని ప్రసాదించాల్సిందిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. సముపార్జించుకున్న స్వాతంత్య్రాన్ని భగవదనుగ్రహంతోనే కాపాడుకోగలం. పరమాత్మ కృపతోనే సమస్త మానవాళీ ఆనందమయమైన జీవితాన్ని గడపగలదు’ అన్నారు.

రమణమహర్షిపై పూజ్యభావం వ్యక్తం చేసేవారు కంచి పరమాచార్యులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 1994 జనవరి 8న, తమ 99వ ఏట భౌతికంగా ఈ లోకాన్ని విడిచినా, ఆధ్యాత్మిక గురువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు.