News

బెంగాల్‌లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ

85views

నూతన పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురికి సిటిజన్‌షిప్‌ సర్టిఫికేట్లను కేంద్రం బుధవారం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిటిజన్‌షిప్‌ సర్టిఫికేట్లను అధికారులు అందజేశారు. 2019లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధనలను మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విషయం తెలిసిందే. చట్టం నిబంధనలు నోటీఫై అయిన రెండు నెలల అనంతరం మే 15న తొలిసారి మొదటి విడతగా 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.