News

జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర

88views

దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ x జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సిటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 22న సికింద్రాబాద్లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్ 30న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లేదా విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం 9281495848, 8287932312 నెంబర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.