News

వైభవంగా శ్రీశైల గిరి ప్రదక్షిణ

80views

శ్రీశైల మహాక్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జున సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, అక్కడి నుంచి వలయదారి మీదుగా గణేష సదనం, సారంగఽధర మండపం, గోశాల, మల్లమ్మ కన్నీరు, మహిషాసురమర్థిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం చేరుకొని తిరిగి నంది మండపానికి చేరుకుంది. క్షేత్రపరిధిలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచే దర్శింపచేస్తూ భక్తులలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ, క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిన కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది.