ArticlesNews

శిథిలావస్థకు చేరిన పురాతన దేవాలయాలు

88views

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దపు నాటి పురాతన దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కొంత కాలానికి పూర్తిస్థాయిలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.ప్రసిద్ధ దేవాలయాల గురించి ఎన్ని మార్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు ఉన్నారని వారు అరోపిస్తున్నారు.

బల్లికురవ మండలం అంటే గుర్తుకు వచ్చేది చోళరాజులు పరిపాలించిన కొణిదెన గ్రామం. ఇక్కడ అప్పట్లో రాజులు 101 బావి, కోటి ఒక్క శిలను ప్రతిష్టించారు. అప్పట్లోనే గ్రామంలో రోజులు వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి దేవాలయాలను ప్రతిష్ఠించారు. వందల సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన రెండు దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. అలానే ఈ గ్రామంలో ఎన్నో శాసనాలు కూడా ఉన్నాయి. పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని గ్రామస్థులకు చెప్పారు. అయినప్పటికీ ఇంత వరకు ఈ దేవాలయాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చుని పూజలు చేయాలన్న భక్తులు భయాందోళన చెందుతున్నారు.

ఆరుమసాల కిందట పడిపోయిన చెన్నకేశవ స్వామి దేవాలయ గోడ నిర్మాణానికి ఇంత వరకు ప్రతిపాదనలు కూడా పంపలేదని ప్రజలు అరోపిస్తున్నారు. ఇటీవల గ్రామ ప్రజలు ఇదే గ్రామంలో చోళరాజుల కాలంనాటి బ్రహ్మ గుండంను విరాళాలతో అభివృద్ధి చేపట్టారు. దేవాలయాలను నిర్మించాలంటే నిధులు పెద్ద ఎత్తున కావాలని ప్రభుత్వం వెంటనే స్పందించి పురాతన దేవాలయాలను అభివృద్ధి పరచాలని ప్రజలు కోరుతున్నారు. దేవాలయాల అర్చక స్వాములు కూడా దేవాలయాలను అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.