News

తిరుమలలో అన్యమత చిహ్నంతో వాహనం

115views

క్రైస్తవమత గుర్తులతో ఉన్న ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారి తీసింది. సాధారణంగా హిందూయేతర మతాలకు చెందిన గుర్తులు, కరపత్రాలు, స్టిక్కర్లతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం. వీటిని అలిపిరి టోల్‌గేట్‌లో జరిపే భద్రతా తనిఖీల్లోనే గుర్తించి తొలగించాలి. కానీ, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మంగళవారం టీఎన్‌ 19 ఏఎక్స్‌ 2772 నెంబరు గల కారు క్రైస్తవ మతానికి చెందిన ఫొటోతో తిరుమలకు వచ్చింది. మ్యూజియం వద్ద పార్కు చేసివున్న కారును గుర్తించిన స్థానికులు తిరుమల విజిలెన్స్‌ అఽధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని కారులో ఆ గుర్తులను తొలగించారు.