News

శాసనాల్లో అగస్త్య ముని ప్రస్థావన

78views

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఐముక్తేశ్వరాలయంలో ఉన్న శాసనాల్లో అగస్త్య మహాముని ప్రస్థావన ఉన్నట్లుగా చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. మంగళవారం ఆయన ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించి శాసనాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… పురాణ పురుషులు, రుషుల ఆగమనం గురించి తెలిపే శాసనాలు అరుదుగా ఉంటాయన్నారు. వేద కాలం నాటి అగస్త్యుని ప్రయాణం గురించి శాసనాల్లో ఉండడం చరిత్రకారులను అబ్బురపరిచే విషయమన్నారు. వింధ్య పర్వతాల్లో నివసించిన అగస్త్యుడు కాశీ క్షేత్రానికి వెళ్లడం, తిరిగి కాశీ నుంచి బ్రహ్మపురం (నేటి పెనుకొండ) వచ్చి ఘనగిరిపై గల బ్రహ్మ సరస్సు పక్కన తపమాచరించినట్లుగా శాసనాల్లో ఉందన్నారు. అలాగే మహాముని మలి అవతారంలో వామనేంద్రుని స్మృతిగా ఓ శివాలయాన్ని నిర్మించినట్లుగా ఉందన్నారు.