News

ఆర్.ఎస్.ఎస్.‌లో ఉన్నాను, మళ్లీ అక్కడికి వెళ్తాను: హైకోర్టు జడ్జీ

122views

‘‘ నేను చాలా సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్నాను, మళ్లీ అవకాశం వచ్చి అక్కడి చేయదగిన పని ఏదైనా ఉందని ఎవరైన నా దగ్గరకి వస్తే నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను’’ కలకత్త హైకోర్టులో రిటైరయిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ చెప్పిన మాటలు ఇవి. తన వృత్తిరీత్యా దాదాపు 37 సంవత్సరాలు ఆర్.ఎస్.ఎస్.కు దూరంగా ఉన్నానని చెప్పారు. ఆయనకు న్యాయమూర్తిగా సోమవారం చివరి పనిదినం కావడంతో బార్ సభ్యుల సమక్షంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో ధైర్యంగా, నిటారుగా ఉండటం నేర్చుకున్నా’

” కొంతమంది వ్యక్తులు ఆర్.ఎస్.ఎస్. అంటేనే అసహ్యంతో చూస్తున్నారు. వారికి నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను” అని ఆయన అన్నారు. 14 సంవత్సరాలకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన జస్టిస్ దాస్.. ఇంతకు ముందు ఒడిషా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. బదిలీపై కలకత్తా హైకోర్టుకు వచ్చి ఇక్కడ పదవీ విరమణ చెందారు.”నేను సంస్థకు(ఆర్ఎస్ఎస్) చాలా రుణపడి ఉన్నాను. నా బాల్యం, యవ్వనం అంతా వారి ఆధ్వర్యంలోనే గడిచిపోయింది” అని దాస్ తన జ్ఞాపకాల దొంతరను గుర్తుచేసుకున్నారు. “నేను ధైర్యంగా, నిటారుగా ఉండటం ఇతరుల పట్ల సమాన దృక్పథాన్ని చూపడం, అన్నింటికి మించి దేశభక్తి, పని పట్ల నిబద్దత చూపడం వంటివన్నీఅక్కడే నేర్చుకున్నానని” అని న్యాయమూర్తి చెప్పారు.

అవసరమైతే ఆర్‌.ఎస్‌.ఎస్‌.లోకి ..
ఏదైనా సాయం కోసం లేదా తాను చేయగలిగిన ఏదైనా పని కోసం వారు తనను పిలిస్తే “సంస్థకు తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని” దాస్ చెప్పారు. “నేను నా జీవితంలో ఏ తప్పు చేయలేదు కాబట్టి, నేను సంస్థకు చెందినవాడినని చెప్పడానికి నాకు ధైర్యం ఉంది, ఎందుకంటే అది కూడా తప్పు కాదు,” అని ఆయన అభిప్రాయపడ్డారు.