273views
తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు పులకించిపోయారు.. ఎండల నుంచి ఉపశమనం పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి తిరుమలలో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా సుమారుగా అరగంట పాటు భారీ వర్షం పడింది. శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులు చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలలో వర్షం పడింది.



