News

ముస్లింలకు విడాకులు మంజూరు అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉంది :‌ కర్ణాటక హైకోర్టు

223views

వివాహం రద్దు చేసుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్న ముస్లిం దంపతులకు విడాకులు ఇచ్చే అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉందని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. షబనం, పర్వీన్‌ అహ్మద్‌ అనే దంపతులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనుశివరామన్‌, జస్టిస్‌ అనంత రామనాథ హెగ్డేల ధర్మాసనం గురువారం విచారించింది. ముబారత్‌ ఒప్పందం ప్రకారం దంపతులు వివాహాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తే ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేయవచ్చునని సూచించింది. ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులను ప్రస్తావించింది.