
223views
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) వేదికగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు ఆ సంస్థ గురువారం ప్రకటించింది. షార్‌లోని ప్రొపల్షన్ టెస్ట్‌బెడ్ వద్ద 85 సెకన్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో రాకెట్ ఇంజిన్ 186 కిలోన్యూటన్‌ల థ్రస్ట్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది. కలాం-250గా వ్యవహరించే ఈ ఇంజిన్.. రాకెట్‌ను భూ వాతావరణం నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించనుందని ప్రకటనలో వెల్లడించింది.



