News

ఏప్రిల్‌ 4 నుంచి అన్నమయ్య వర్ధంతి వేడుకలు

282views

తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి వేడుకలు ఏప్రిల్‌ 4 నుంచి 8వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 5న సాయంత్రం 6గంటలకు తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం చేపడతారు. 5 నుంచి 8వ తేదీ వర కు నాలుగు రోజుల పాటు తిరుపతి అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యాన మందిరం, 108 అడుగల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.