News

వెయ్యి సంవత్సరాల తరువాత మల్లేశ్వరాలయ పునరుద్ధరణ ; స్వర్ణ శిఖర కుంభాభిషేక ఉత్సవాలకు శ్రీకారం

288views

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వ రస్వామి ఆలయ స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 18 వరకు నిర్వ హించే ఉత్సవాల్లో తొలిరోజు మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులతో రుత్వికులు గణపతి పూజ చేయించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వర్ణశిఖర ప్రతిష్ఠ, మల్లేశ్వరుడికి షోడశమాతృక పూజ, పాంచాహ్నిక రుత్విక దీక్షాధారణ, యాగశాల సంస్కారం, అఖండదీప ప్రజ్వలన కార్యక్రమాలను రుత్వికులు నిర్వహించారు. దేశంలోని ప్రధాన జీవనదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిం చారు. ఈసందర్భంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ వెయ్యి సంవత్సరాల తరువాత మల్లేశ్వరాలయ పునురుద్ధరణ పనులు చేపట్టడం విశేషం అన్నారు. రాతి స్తంభాలతో స్వామి వారి ఆలయ నిర్మాణానికి దాత సంకా నరసింహారావు అందించిన సహకారాన్ని ప్రశంసించారు. ఈనెల 18న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం పూర్తయిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారన్నారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాదశర్మ, దుర్గగుడి ట్రస్టుబోర్డు చైర్మన్ రాంబాబు దంపతులు పాల్గొన్నారు.