News

తమిళనాడులో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

705views

హసన్ అలీ (28), హారిష్ మొహమ్మద్ (32) అనే ఇద్దరు తీవ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ NIA 13/7/19 శనివారం నాడు తమిళనాడులోని నాగపట్టణంలో అరెస్టు చేసింది. దక్షిణ భారతంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ‘అన్సరుల్లా’ అనే తీవ్రవాద సంస్థతో దగ్గరి సంబంధాలున్నాయనే కారణంతో వారి నివాసాలపై ఆకస్మిక దాడి చేసి NIA వారిద్దరినీ స్వాధీనంలోకి తీసుకుంది.

ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో జరిగిన దాడుల తరహాలో భారత్లో కూడా పేలుళ్లు జరపాలని ‘అన్సరుల్లా’ కుట్ర పన్నినట్లుగా NIA తన నివేదికలో కేంద్ర హోం శాఖకు వెల్లడించింది. దీనికోసం జీహాదీలు పెద్ద మొత్తంలో డబ్బు, ఆయుధాలు సమకూర్చుకున్నట్టుగా కూడా NIA తెలిపింది. ఈ సంస్థ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ NIA జూలై 9న ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసింది. నిందితుల అన్వేషణలో భాగంగా వివిధ ప్రదేశాలలో దాడులు నిర్వహించిన NIA అధికారులు ఆ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.