News

దేశ, విదేశాల నమూనాల అధ్యయనంతో అయోధ్య పట్టణ ప్రణాళిక

339views

దేశ, విదేశాల్లోని తిరుపతి, అమృత్సర్, వాటికన్ సిటీ, కాంబోడియా, జెరూసలెం వంటి ప్రముఖ ప్రార్ధన స్థలాల అధ్యయనంతో ఆధ్యాత్మిక నగరి అయోధ్య ప్రణాళికను రూపొందించినట్లు పట్టణ ప్రాజెక్టు మాస్టర్ ప్లానర్, వాస్తుశిల్పి (ఆర్కిటెక్ట్) దీక్షు కుక్రేజా తెలిపారు. మరో మూడు నాలుగేళ్లలో పర్యాటక ప్రాంతంగా మారే అయోధ్యను నిత్యం మూడు లక్ష లకు పైగా భక్తులు సందర్శిస్తారనే అంచనా ఉందన్నారు. జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతంగా భూ వినియోగం, ధర్మశాలలు (సత్రాలు), గృహ వసతులు, రహదారులతో అయోధ్య పట్టణ చారిత్రక, సాంస్కృతిక వైభవం ఎక్కడా దెబ్బతిన కుండా మౌలిక వసతుల మెరుగుదలకు దీక్షు కుక్రేజా ప్రణాళికలు రూపొందించారు. రూ.85,000 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన అయోధ్య పునరుద్ధరణ మాస్టర్న్ పూర్తి కావడానికి పదేళ్ల సమయం పడు తుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారు పార్కింగు స్థలాల్లో వాహనాలు నిలిపి, అయోధ్యలో రవాణాకు స్థానికంగా ఉన్న విద్యుత్తు వాహనాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు.