Newsvideos

అయోధ్య రామమందిరం కీలక ఘట్టాలు

400views

అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ అద్భుత ఘట్టం కోసం దేశప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ శ్రీరామ జన్మభూమి వివాదం ఏళ్ల తరబడి కొనసాగింది. వివాదాస్పద భూమిపై హిందూ, ముస్లిం పక్షాలు తమ వాదనను కొనసాగించి సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. చివరకు 2019లో సుప్రీంకోర్టు హిందూ పక్షానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. అయోధ్యలో 1992లో నేలమట్టమైన వివాదాస్పద బాబ్రీ మసీదు ఉన్న చోటే ఇప్పుడు రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.