News

హిందూ డిక్లరేషన్‌పై కమిషన్‌ ఏర్పాటుకు డిమాండ్‌

282views

హిందూ డిక్లరేషన్‌పై కమిషన్‌ ఏర్పాటు చేయాలని నెల్లిమర్ల దుర్గాపీఠం అధిపతి చిన్నస్వామి డిమాండ్‌ చేశారు. మంగళవారం విశాఖ నగరంలోని ఓ హోటల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశం సనాత ధర్మానికి ప్రతీకగా నిలిచిందన్నారు. మన సంప్రదాయాలు, ఆలయాలను పరిరక్షించే దిశగా హిందూ డిక్లరేషన్‌ ఉండాలన్నారు. మేనిఫెస్టోలో దానికి ప్రాధాన్యమిచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుంన్నారు. హిందూ ధార్మిక సంఘం అధ్యక్షులు బుద్ధరాజు శివాజీ మాట్లాడుతూ అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల ఆలయాల భూములు, దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బిజేపి నాయకులు విష్ణుకుమార్‌రాజు, పీవీఎన్‌ మాధవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పైడా కృష్ణప్రసాద్‌, కె.లలిత, రాగం కిషోర్‌, ఏకే బాలాజీ, పి.వి.నారాయణ, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.