
285views
అనకాపల్లి జిల్లా ఎమ్.అలమండ గ్రామంలో గ్రామ ప్రజలు అధ్వర్యంలో అయోధ్య రాముని శోభయాత్ర చేస్తూ అంగరంగ వైభవంగా కోలాటాల నడుమ సంప్రదాయబద్దంగా అక్షింతలు ఊరేగింపు నిర్వహించారు. రామాలయంలోని స్వామివారిని మంత్రి దర్శించుకుని శోభాయాత్రను తిలకించారు.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లిమండలంలోని కొత్తపెంటా గ్రామంలో ఆదివారం శ్రీ సద్గురు దేవానంద సరస్వతి మహారాజ్ వారి 24వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సుప్రభాతం పతావిష్కరణ, నగర సంకీర్తన, భగవద్గీత పారాయణం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి పీఠాధిపతులు స్వామీజీ భక్తులు శిష్యులు వేలాదిగా తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది స్వామివారిని దర్శించి పూజించి స్వామి వారి అనుగ్రహం పొందారు. స్వామి సరస్వతి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు.





