
271views
తూర్పునావికాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తన రెండు రోజుల పర్యటనలో ఒడిశాలోని భారత నావికాదళం ప్రధాన శిక్షణా సంస్థ INS చిల్కాను సందర్శించారు. అగ్నివీర్ల శిక్షణా శిబిరాన్ని సందర్శించి వారి పటిమను ప్రశంసించారు…అగ్నివీర్ల శిక్షణకు సంబంధించిన వివిధ అంశాల గురించి, సమకాలీన శిక్షణను నిర్ధారించే దిశగా మౌలిక సదుపాయాల వృద్ధి ప్రణాళికలపై ఆయన సమీక్షించారు. శిబిరంలో చేపడుతున్న హరితహారం కార్యక్రమాలను ఆయన తెలుసుకున్నారు.
INS చిల్కాలోని అధికారులు, నావికులు, DSC సిబ్బందితో మధ్యాహ్న భోజనంలో సంభాషించారు.. ఆ సమయంలో అన్ని విభాగాలలో శిక్షణార్థుల పనితీరును పెంపొందించడానికి స్పూర్తినిచ్చే అంశాలను వివరించారు..ఈపర్యటనలో వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ సతీమణి సంధ్యా రావు పెంధార్కర్ కూడా వున్నారు.





