
హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటనలు పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల రోజువారీ జీవితంలో హింస, వేదన ఒక భాగంగా మారుతోంది. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సింధ్ ప్రావిన్స్ నుండి మరో కేసు వెలుగులోకి వచ్చింది, ఓ హిందూ మైనర్ బాలికను అపహరించి మతం మార్చారు.
సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ జిల్లా టాండో జామ్ నగరంలో ఈ సంఘటన జరిగింది. సాజిద్ హుస్సేన్ అనే ఇస్లామిక్ ఛాందసవాది ఒక మైనర్ హిందూ బాలికను ఆమె ఇంటి నుండి బలవంతంగా కిడ్నాప్ చేసి ఇస్లాం మతంలోకి మార్చారని బాధితురాలిపై అత్యాచారం కూడా చేసాడని పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త నారాయణ్ దాస్ తన నివేదికలో వెల్లడించారు.
సింధ్ ప్రావిన్స్‌లో ఏ అమ్మాయికైనా వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఈ ఇస్లామిక్ ఛాందసవాది హుస్సేన్ నిబంధనలను ఉల్లంఘించి బాలిక వయసు 19 ఏళ్లుగా చూపించాడు. బలవంతంగా పెళ్లి చేసుకున్న తర్వాత బాధితురాలి పేరును ‘నైమత్’గా మార్చాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అమ్మాయి తల్లిదండ్రులు వివాహంతో సంతోషంగా లేరని ఆమెను చంపాలనుకుంటున్నారని నిందితుడే స్వయంగా ఒక పిటిషన్ దాఖలు చేశాడు.
ఏటా సింధు ప్రావిన్స్‌లో నివసిస్తున్న 12 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసున్న హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఏటా వెయ్యిమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. ఒక్క సింధ్‌లోనే ఏటా 1000-2000 కేసులు నమోదవుతున్నాయి.అయితే ఇది అధికారిక సమాచారం మాత్రమే. ఇంకా లెక్కలోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి.
Source : Hindu Post





